: ఒబామా భారత పర్యటన షెడ్యూల్ ఇదే
భారత గణతంత్ర ఉత్సవాల ముఖ్యఅతిథిగా పాల్గొననున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి... జనవరి 25 వేకువజామున 4.45 నిమిషాలకు ఒబామా ఢిల్లీ చేరుకోనున్నారు. ఉదయం 10.10 నిమిషాలకు ఆయన రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. 10.40 నిమిషాలకు రాజ్ ఘాట్ కు చేరుకోనున్నారు. 11.20 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో ఒబామా భేటీ కానున్నారు. 1.50 నిమిషాలకు మోదీ, ఒబామా కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగే విందులో పాల్గొననున్నారు. జనవరి 26న ఉదయం 9.25 నిమిషాలకు ఒబామా రాష్ట్రపతి భవన్ కు రానున్నారు. 10.00 గంటలకు ఆయన భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 12.40 నిమిషాల నుంచి 3.10 నిమిషాల వరకు సీఈవోల సమావేశంలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రదాని మోదీతో కలిసి మౌర్య షెరటాన్ లో సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 6.50 నిమిషాల నుంచి 7.20 నిమిషాల మధ్య రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని విందులో ఒబామా పాల్గొంటారు. జనవరి 27 ఉదయం 10.40 నిమిషాలకు ఢిల్లీ నుంచి సిరికోటకు చేరుకుంటారు. 12.20 నిమిషాల నుంచి 1.30 నిమిషాల మధ్య హోటల్ కు చేరుకుని భోజనం ముగిస్తారు. అనంతరం సాయంత్రం 3.05 నిమిషాల నుంచి 4.05 నిమిషాల వరకు తాజ్ మహల్ ను సందర్శిస్తారు. సాయంత్రం 4.35 నిమిషాలకు పాలం ఎయిర్ పోర్టుకు చేరుకుని, 5.50 నిమిషాలకు అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.