: అవినీతి కూపం రెవెన్యూ శాఖ ... రాజధాని నిర్మాణమైనా నిజాయతీతో చేస్తారా?: ఆర్టీఐ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ విజయ్ బాబు ఎపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఆయన విరుచుకుపడ్డారు. ఆ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, కనీసం సమాచార హక్కు చట్టాన్ని కూడా లెక్కచేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు డీఆర్వోపై 78 అవినీతి ఆరోపణలున్నా, స.హ చట్టం కింద ఎన్ని కేసులు వచ్చినా రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని అన్నారు. నవ్యాంధ్ర కొత్త రాజధాని నిర్మాణమైనా నిజాయతీగా జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. టీటీడీ ధార్మిక సంస్థ అయినప్పటికీ, ఆ సంస్థకూ ఆర్టీఐ వర్తిస్తుందని, భక్తులు, ప్రజలు ఎవరైనా సమాచారం అడిగితే సమాధానం ఇవ్వాల్సిందేనని విజయ్ బాబు స్పష్టం చేశారు.