: విమానం కూలుతోందని అరుపులు పెట్టిన పైలట్... ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్ రహస్యం!
గత సంవత్సరం ఆఖర్లో సముద్రంలో కూలిపోయిన విమానంలో వున్న వారందరికీ తాము చనిపోబోతున్నామని తెలుసు. గుండెలను పిండేసే ఈ విషయాన్ని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని విచారణా అధికారి ఒకరు తెలిపారు. విమానం బ్లాక్ బాక్స్, ఫ్లయిట్ డేటా రికార్డర్లు గతవారం వెలికి తీసిన తరువాత వాటి విశ్లేషణ మొదలైంది. కూలిపోయే ముందు పలుమార్లు పైలట్లు హెచ్చరికలు జారీ చేశారని, అందువల్లే కొందరు లైఫ్ జాకెట్లు ధరించారని ఆయన తెలిపారు. విమానాన్ని స్థిరంగా ఉంచేందుకు పైలట్లు చాలా కృషి చేశారని, అయినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. వారు విమానం కూలిపోతోందని కూడా హెచ్చరించారని తెలిపారు. కాగా, బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ల విశ్లేషణ నివేదిక వచ్చే వారం ప్రభుత్వానికి చేరనుంది.