: చీరలని చెప్పి చిత్తు కాగితాలు... ఆన్ లైన్ షాపింగ్ పేరిట కొత్త రకం దోపిడీ!
ఆన్ లైన్ షాపింగ్ పేరిట మోసం చేసేందుకు మోసగాళ్ళు కొత్తదారులు వెతుకుతున్నారు. టీవీలో చూపిన చీరలు కొనాలని ఆశపడ్డ ఆ మహిళలను చిత్తు కాగితాలు వెక్కిరించాయి. తక్కువ ధరకే ఖరీదైన చీరలు వస్తాయన్న ఆశతో టీవీలో ఇచ్చిన నెంబర్ కు మిస్డ్ కాల్ చేసి చీరలను బుక్ చేసుకున్న వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచకు చెందిన పలువురు మహిళలు మోసపోయారు. ప్రకటనలు నమ్మి తక్కువ ధరకే ఏడు ఖరీదైన చీరలు వచ్చాయన్న ఆశతో పోస్టుమ్యాన్ ఇచ్చిన బ్యాగ్ తీసుకునేందుకు రూ.2400 చెల్లించి, ఆ బ్యాగ్ విప్పి చూడగా, చిత్తు కాగితాలు కనిపించాయి. దీంతో లబోదిబో మానడం తప్ప వారేమీ చేయలేక పోయారు.