: తెలంగాణను నెం.1 చేస్తామన్నారు... స్వైన్ ఫ్లూలో చేశారు: కేసీఆర్ పై షబ్బీర్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీకాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ప్రతి విషయానికి ఎవరినో ఒకరిని బాధ్యులను చేస్తూ, సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్... ప్రస్తుతం తెలంగాణలో పంజా విసిరిన స్వైన్ ఫ్లూకు ఎవరిని బాధ్యులు చేస్తారని నిలదీశారు. ఇంతకాలం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేస్తానని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్... స్వైన్ ఫ్లూలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశారని ఎద్దేవా చేశారు. చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తున్నప్పటికీ ఇంతకాలం వ్యాధిని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.