: దమ్ముంటే కేటీఆర్, హరీష్ లను పంపి బాబు యాత్రను అడ్డుకో... కేసీఆర్ కు రేవంత్ సవాలు
తెలంగాణాలో చంద్రబాబు పర్యటన ఖరారు అయిందని తెలియగానే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన పర్యటనను అడ్డుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, అయితే గవర్నర్ ఈ విషయంలో కలుగజేసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఒకవేళ అది కేసీఆర్ మనసులో మాట అయితే, దమ్ముంటే కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులను పంపి బాబు యాత్రను అడ్డుకోవాలని అన్నారు. నిజాం వారసుడిలా కేసీఆర్ ప్రవర్తించి బాబు యాత్రకు ఆటంకాలు కల్పిస్తే, పటేల్ వారసులం అయిన తాము యాత్రను సజావుగా సాగేలా చూస్తామని తెలిపారు.