: మావోయిస్టు నేత దుబాసి శంకర్ భార్య అరెస్ట్... కోర్టులో హాజరుపరచాలన్న దుబ్బాక ఎమ్మెల్యే!
మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్ భార్య భారతిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిన్న హైదరాబాదులోని మెహిదీపట్నం పరిధిలోని ఓ ఆస్పత్రికి వచ్చిన ఆమెను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దుబాసి శంకర్ ఆచూకీ గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. మరోవైపు భారతి అరెస్టును ధ్రువీకరించుకున్న విరసం నేతలు వరవరరావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆమెను కోర్టులో హాజరుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.