: పుష్కర ఏర్పాట్ల పరిశీలనకు రాజమండ్రి ఎంపీ పాదయాత్ర!
రాజమండ్రి ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ వినూత్న రీతిలో దూసుకెళుతున్నారు. అధిక సమయం రాజమండ్రిలోనే గడుపుతున్న ఆయన తన నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. త్వరలో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలకు రాజమండ్రి కేంద్ర బిందువుగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడి ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు మురళీ మోహన్ పాదయాత్ర చేపట్టారు. తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న పుష్కర ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన గోదావరి వెంట కాలిబాట పట్టారు.