: మన్మోహన్ సింగ్ ను సీబీఐ ప్రశ్నించిందా?


బొగ్గు కుంభకోణంలో సీబీఐ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించినట్టు సమాచారం. రెండ్రోజుల క్రితం ఆయన నివాసంలోనే విచారణ జరిపినట్టు పీటీఐ ఓ కథనం వెలువరించింది. యూపీఏ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో మన్మోహన్ బొగ్గు శాఖను పర్యవేక్షించారు. దీంతో, అక్రమ కేటాయింపుల్లో ఆయన పాత్రపై సందేహాలు ముసురుకున్నాయి.

  • Loading...

More Telugu News