: అవును, నేను బీజేపీ మనిషినే: ధీమాగా చెప్పిన సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్
కేంద్ర సెన్సార్ బోర్డుకు చైర్మన్ గా నియమితుడైన పహ్లాజ్ నిహలాని తాను బీజేపీ మనిషినేనని ధీమాగా చెబుతున్నారు. బీజేపీతో సంబంధాలున్న వ్యక్తులనే సెన్సార్ బోర్డులోకి తీసుకున్నారంటూ విమర్శలు వస్తుండడంపై ఆయన పైవిధంగా స్పందించారు. బీజేపీ వ్యక్తినని చెప్పుకునేందుకు గర్విస్తున్నానని, ప్రధాని మోదీ తన హీరో అని ఉద్ఘాటించారు. బీజేపీ పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. మోదీ తన యాక్షన్ హీరో అని, ఆయన దార్శనికుడు అని కొనియాడారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ నిహలాని ఈ వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు మార్గదర్శకాల అమలులో కచ్చితంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.