: టీడీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన రోజా


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత కూడా టీడీపీ నేతలు చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే వారు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని అన్నారు. తిరుపతి టీడీపీ శాసనసభ్యుడు వెంకటరమణ మరణించడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News