: కోరలు చాస్తున్న స్వైన్ ఫ్లూ... ఉస్మానియాలో ఇద్దరు బలి
స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రబలుతోంది. తాజాగా, హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన షరీఫ్, హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన లలిత ఈ నెల 18న స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు.