: మితంగా బీరు మేలు చేస్తుందంటున్న పరిశోధకులు!


మితంగా బీరు సేవిస్తే ఆరోగ్యానికి మేలని పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్నదే. తాజాగా, ఓ పరిశోధనలో బీరు తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని గుర్తించారు. అయితే, మితంగా పుచ్చుకుంటేనే సానుకూల ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించి మొత్తం 15 వేల మందిపై అధ్యయనం చేపట్టారు. వారిలో పురుషులు, స్త్రీలు, యువకులు, మధ్య వయస్కులు ఉన్నారు. మద్యం తాగని వ్యక్తుల కంటే మితంగా మద్యం తాగే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం 20 శాతం తక్కువని ఈ పరిశోధనలో తేలింది. డోసు ఎక్కువైతే బీరు కూడా హానికరమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News