: పదవి కోసం పార్టీ వీడిన స్వార్థపరుడు మహేందర్ రెడ్డి: చినరాజప్ప


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తెలంగాణలో తిరగనివ్వబోమని, ఏపీ సీఎంకు తెలంగాణలో ఏం పని? అని వ్యాఖ్యానించిన మంత్రి మహేందర్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు. పదవి కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన స్వార్థపరుడు మహేందర్ రెడ్డి అని విమర్శించారు. చంద్రబాబుపై మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. ఇక, ఎర్రచందనం తరహాలోనే విశాఖ ఏజెన్సీలో గంజాయి మాఫియా పైనా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News