: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేజ్రీవాల్ కు నోటీసు


ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం నోటీసు పంపింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని తమకే ఓటు వేయాలన్న వ్యాఖ్యలపై ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కేజ్రీ పైవిధంగా వ్యాఖ్యానించారు. వెంటనే కాంగ్రెస్ ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేసింది. దాంతో స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు నోటీసు పంపారు.

  • Loading...

More Telugu News