: సీఎంగా కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసింది: దిగ్విజయ్ సింగ్
ముఖ్యమంత్రిగా కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతోందని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలకు డిగ్గీ సూచించారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో ఈరోజు తెలంగాణ పీసీసీ సమన్వయ భేటీలో పాల్గొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. వారు రాజీనామా చేసేలా వారి ఇళ్ల ముందు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అటు పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయని కలెక్టర్లపైనా కోర్టులో కేసులు వేయాలని నిర్ణయించినట్టు దిగ్విజయ్ వెల్లడించారు.