: జపనీస్ బందీల విడుదలకు భారీ మొత్తం డిమాండ్ చేస్తున్న ఐఎస్ఐఎస్


ఐఎస్ఐఎస్ గ్రూపు మరో కిరాతకానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. తాము బందీలుగా పట్టుకున్న జపాన్ జాతీయులను చంపేస్తామంటూ ఓ వీడియోలో హెచ్చరించింది. వారిని విడుదల చేయాలంటే మూడు రోజుల్లో 200 మిలియన్ డాలర్లు (రూ.1236 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐఎస్ఐఎస్ గ్రూపు అనుబంధ సంస్థ అల్ ఫుర్ఖాన్ మీడియా ఈ వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేసింది. ఆ వీడియోలో కనిపించిన బందీలను కెంజీ గోటో జోగో, హరునా యుకావా అని భావిస్తున్నారు. దీనిపై జపాన్ అధికార వర్గాలు స్పందించలేదు. కాగా, ఆ వీడియోలో బ్రిటీష్ జాతీయుడిగా భావిస్తున్న మిలిటెంట్ మాట్లాడాడు. తమపై పాశ్చాత్య దేశాల సైనిక దాడులను జపాన్ సమర్థిస్తున్నందునే ఆ దేశానికి చెందిన పౌరులను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపాడు.

  • Loading...

More Telugu News