: కేసీఆర్ కు నిజాంపై ఇష్టం లేదు... కానీ, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారు: కిషన్ రెడ్డి


నిజాం చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... మరోవైపు నిజాంపై, టీఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది నిజాం దౌర్జన్యాలను, అరాచకాలను, దోపిడీని సమర్థించేందుకా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజాంపై ఎలాంటి ప్రేమ, అభిమానం లేదని... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలసి ఓట్లు పొందేందుకే ఆయన దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజాం పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News