: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సందర్శకులకు నో!
శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. దాడులకు పాల్పడవచ్చన్న తీవ్రవాద హెచ్చరికల మేరకు విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి విమానాశ్రయ సందర్శకుల పాసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులు జరగవచ్చన్న ఐబీ నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను మరింత పెంచారు.