: సిక్కోలులో కూలిన చిన్న విమానం
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనిత మండలం వద్ద కొద్దిసేపటి క్రితం ఓ చిన్న విమానం కుప్ప కూలింది. ఆకాశంలో విహరిస్తున్న తేలికపాటి విమానం ఉన్నట్లుండి కూలిపోయింది. విమానం కూలిన ప్రాంతం ఇసుక నేల కావడంతో విమానం ఇసుకలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదంపై స్థానికులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారమందించారు.