: కోహ్లీ, రహానే వికెట్లను కోల్పోయిన భారత్
ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు రహేనే ఔట్ కాగా, 64 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫిన్ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చి రహానే ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఫిన్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో అంబటి రాయుడు (23), సురేష్ రైనా (1) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు.