: శ్రీలంక ఎన్నికల్లో డబ్బు, మద్యం, బ్యానర్లు, పోస్టర్లు... ఇలాంటివేమీ లేవు: భన్వర్ లాల్


ఇటీవల శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు పర్యవేక్షకుడిగా ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్ లాల్ వెళ్లారు. అక్కడ జరిగిన ఎన్నికల తీరును ఆయన ఎంతో మెచ్చుకున్నారు. మన దేశంలోలాగా శ్రీలంక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, బ్యానర్లు, వాల్ పోస్టర్ల లాంటివేవీ ఉండవని చెప్పారు. కేవలం రేడియోలో, వార్తాపత్రికల్లో మాత్రం ప్రచారం చేసుకుంటారని తెలిపారు. బ్యాలట్ పద్ధతిలో అక్కడి ఎన్నిక జరిగిందని... పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రమే కౌంటింగ్ స్టార్ట్ చేసి, తెల్లవారేసరికి ఫలితాన్ని ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను నష్టపరచే రీతిలో అక్కడ ఎలాంటి ఘటనలు జరగలేదని అన్నారు.

  • Loading...

More Telugu News