: వాయిదా పడ్డ కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ లో పర్యటించాల్సి ఉంది. మెదక్ జిల్లాలోని గజ్వేల్ కేసీఆర్ సొంత నియోజకవర్గం. గజ్వేల్ పర్యటనలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, అనివార్య కారణాల వల్ల కేసీఆర్ పర్యటన అర్థాంతరంగా వాయిదా పడింది. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడిందని ముఖ్యమంత్రి పీఆర్వో ఓ ప్రకటనలో వెల్లడించారు. పర్యటన ఎప్పుడు జరగనుందన్న వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.