: తెలంగాణలో 116, ఏపీలో 6 స్వైన్ ఫ్లూ కేసులు... 20కి చేరిన మృతుల సంఖ్య
స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ రక్కసి పంజా విసిరింది. ఏకంగా 116 స్వైన్ ఫ్లూ కేసులు తెలంగాణలో నమోదు కాగా... ఏపీలో 6 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. దీంతో, నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో మరొకరు చనిపోయారు. దీంతో, ఇప్పటి దాకా ఈ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. రోగులకు వైద్యం అందిస్తున్న డాక్లర్లకు కూడా ఇది సోకింది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఐదుగురు డాక్టర్లు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు.