: నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా లోకేశ్


కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామాన్ని టీడీపీ యువనేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ దత్తత తీసుకున్నారు. 'స్మార్ట్ విలేజ్' పథకంలో భాగంగా ఆయన ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక నుంచి ఈ గ్రామంలో లోకేశ్ పలు అభివృద్ధి పనులు చేపడతారు. త్వరలోనే ఆ గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రధాన సమస్యలైన తాగునీరు, వైద్యం, విద్య వంటి పలు అంశాలపై దృష్టి పెట్టనున్నారు. మరోవైపు, చంద్రబాబు అరకును దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News