: నియోజకవర్గ అధికారులతో బాలకృష్ణ సమావేశం
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో భేటీ అవుతూ, తన నియోజకవర్గంలో పథకాల అమలుపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన అధికారులతో సమావేశమయ్యారు. రానున్నది వేసవి కావడంతో, ముందు జాగ్రత్తగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని హిందూపురంలో బాలయ్య ఎలెవన్, మీడియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో బాలకృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఉత్సాహంగా ఫీల్డింగ్ చేసి అభిమానులను అలరించారు. మ్యాచ్ తాలూకు ఫొటోలను ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పెట్టారు. వాటికి భారీ సంఖ్యలో లైక్స్ లభించడం విశేషం.