: ఫిబ్రవరి ఐదు నుంచి కొత్తగూడెంలో ఆర్మీ సెలక్షన్స్


ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో సైనిక నియామక ర్యాలీ జరగనుంది. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన యువకులకు సైన్యంలోని వివిధ విభాగాల్లో అవకాశాలు దగ్గర కానున్నాయి. సోల్జర్ (టెక్నికల్), సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ (టెక్నికల్), సోల్జర్ (జనరల్ డ్యూటీ), సోల్జర్ ట్రేడ్స్‌మెన్, హవల్దార్ (ఎడ్యుకేషన్) ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, కొత్తగూడెంలోని ప్రకాశం మైదానం సింగరేణి అధీనంలో ఉండటంతో, నియామకాల నిర్వహణకు సంబంధించి సింగరేణి ఛైర్మన్‌ ను అనుమతి కోరుతూ భారత సైన్యం ఓ లేఖను పంపనుంది.

  • Loading...

More Telugu News