: ఏ నిర్ణయమైనా నేనొక్కడినే తీసుకుంటానన్న మహా ముఖ్యమంత్రి
మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ఢిల్లీలో కానీ, గల్లీలో కానీ తీసుకోవడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తాను శక్తిమంతమైన ముఖ్యమంత్రినని, ఏ నిర్ణయమైనా తాను ఒక్కడినే తీసుకుంటానని చెప్పారు. తమ ప్రభుత్వం పడిపోయే స్థితిలో లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చాయి. తమ భాగస్వామ్య పక్షమైన శివసేనను ఉద్దేశించే ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.