: తీవ్రవాది లఖ్వీ కస్టడీ నెలపాటు పొడిగింపు
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, తీవ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ జ్యుడీషియల్ కస్టడీని ఇస్లామాబాద్ హైకోర్టు పొడిగించింది. గతేడాది డిసెంబర్ 18న లఖ్వీకి ఇస్లామాబాద్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది. అనంతరం నెలపాటు కస్టడీని పొడిగిస్తున్నట్టు కోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. కాగా ఈ నెల మొదటివారంలో లఖ్వీకి బెయిల్ మంజూరైనప్పటికీ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలతో జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే.