: రైల్వే ప్రైవేటీకరణ లేదు: సురేష్ ప్రభు


కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే రైల్వే శాఖ ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. కాబట్టి రైల్వే ప్రైవేటీకరణ అనేదే లేదని తెలిపారు. రైల్వేలో పీపీపీ, ఎఫ్ డీఐలను ఆహ్వానించటంపై సికింద్రాబాద్ లోని తార్నాకలో సదస్సు జరుగుతోంది. దీని ద్వారా నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల అభిప్రాయాలు, సలహాలను సేకరిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రైల్వే అగ్రస్థానంలో ఉండాలన్నది ప్రధాని నరేంద్రమోదీ కల అని చెప్పారు. అందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News