: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి కంగారుపడి, కంగారుపెట్టిన సన్నీలియోన్


ఒక మ్యాగజైన్‌ ఆవిష్కరణకు వచ్చిన శృంగార తార సన్నీ లియోన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి కాసేపు అందరినీ కంగారు పెట్టింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో 'మ్యాన్‌ డేట్' కొత్త సంచిక ఆవిష్కరణ జరిగింది. ఈ పత్రిక కవర్ పేజీపై సన్నీ దంపతుల ఫొటోను ప్రచురించారు. ఈ కార్యక్రమానికి భర్తతో పాటు హాజరైన సన్నీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. దాన్ని తెరిచేందుకు కాస్తంత ఆలస్యం అయింది. ఈలోగా లోపలున్న సన్నీ నానాయాగీ చేసిందట. చివరికి మెకానిక్ లను పిలిపించి లిఫ్ట్ ఓపెన్ చేయించారు. బయటకు వచ్చిన సన్నీ నిర్వాహకులపై చిర్రుబుర్రులాడుతూ వెళ్లింది. తమ అభిమాన నటి క్షేమంగా బయటకు రావడంతో సన్నీలియోన్ అభిమానులు, ప్రోగ్రామ్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News