: ఒబామా పర్యటన: అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రత పెంపు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రత పెంచారు. సరిహద్దు భద్రతా దళాలకు చెందిన పది కంపెనీల అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లోనూ భద్రత దళాలు మోహరించాయి. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమయంలో లష్కరే తోయిబా ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి దాడులు చేయవచ్చన్న సమాచారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉంటే తమ అధ్యక్షుడు భారత్ పర్యటన సమయంలో దాడులు చేస్తే సహించేదిలేదని పాకిస్థాన్ ను అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే.