: కూలిన విమానం... 35 మంది సైనికుల మృతి
సరుకు రవాణా చేసే చిన్న సైజు విమానం కూలిన ఘటనలో 35 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. సిరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించక పోవడంతో కార్గో విమానం కుప్పకూలి పోయింది. సైనిక విభాగంలో పని చేస్తున్న కీలక సభ్యులు ఈ ఘటనలో మృతి చెందారు. ఈ వివరాలను ఆ దేశ న్యూస్ ఏజన్సీ ధ్రువీకరించింది.