: వరంగల్ లో విషాదం... బాలిక ప్రాణాలు బలిగొన్న కిక్కిరిసిన రైలు


సంక్రాంతి అనంతరం తమ తమ గమ్యస్థానాలకు వెళుతున్న ప్రజలతో కిక్కిరిసివున్న రైలు ఓ బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. రైలులో ఊపిరాడక ఆ బాలిక మృతి చెందినట్టు తెలుస్తోంది. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న తమ కూతురు జ్యోతిని చికిత్స కోసం పుష్‌ పుల్ రైలులో సికింద్రాబాదుకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలు జనగామ వద్దకు రాగానే, రద్దీ మరింతగా పెరిగి శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ఆ పాప సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు జనగామలో రైలు దిగి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News