: 400 ఎంపీ సీట్లివ్వండి... అయోధ్యలో రామమందిరం కడతాం: వీహెచ్ పీ నేత రాఘవరెడ్డి
అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లను బీజేపీకి కట్టబెడితే, మరుక్షణమే అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. వీహెచ్ పీ స్వర్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం కర్నూలులో జరిగిన ‘హిందూ శంఖారావం’ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆర్టికల్ 371ని సవరించి హిందువుల కలలను సాకారం చేస్తామని ప్రకటించారు. దేశంలో ప్రతి హిందువు తన సంపాదనలో కొంత మొత్తాన్ని సామాజిక సేవ కోసం కేటాయించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.