: భారత్ పై ఉగ్రదాడి జరగరాదు... ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: పాక్ కు అమెరికా హెచ్చరిక
భారత్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ కు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసంది. గణతంత్ర వేడుకలకు తమ అధ్యక్షుడు ఒబామా విచ్చేస్తున్న సందర్భంగా భారత్ పై ఎలాంటి సీమాంతర ఉగ్రవాద దాడులు జరగరాదని సూచించింది. ఒకవేళ ఎలాంటి దాడైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ లో పర్యటిస్తున్న సమయంలో కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో, పాక్ కు అమెరికా హెచ్చరికలు పంపింది.