: అమితాబ్ చేతికి గాయం
లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేతి వేలికి గాయం అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఆయనే తెలిపారు. "మంచి నీళ్ల గ్లాసు జారి కింద పడి ముక్కలైంది. గాజు ముక్కలను ఏరుదామని ప్రయత్నించా. అప్పుడు కుడి చేతి వేలుకు గాజు ముక్క గుచ్చుకుని, గాయమైంది" అని చెప్పారు. మరోవైపు, తాను రాజకీయాల్లో లేనని, మరోసారి రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న ఆలోచన కూడా లేదని బిగ్ బీ స్పష్టం చేశారు. జీవితంలో గెలుపు, ఓటములు సర్వసాధారణమని, అన్నింటినీ ఎదుర్కోవాలని యువతకు పిలుపునిచ్చారు.