: వరల్డ్ రికార్డు హీరో ఏబీకి అభినందనల వెల్లువ


కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు! భీకరస్థాయిలో ఊచకోత కోస్తే తప్ప అలాంటి ఇన్నింగ్స్ ఆవిష్కృతం కాదు. జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం ఆ అద్భుత ప్రదర్శనకు వేదికైంది. విండీస్ తో మ్యాచ్ లో సఫారీ వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ వరల్డ్ రికార్డు బ్యాటింగ్ ప్రదర్శనతో చరిత్ర పుటల్లోకెక్కాడు. కోరే ఆండర్సన్ పేరిట ఉన్న 36 బంతుల్లో సెంచరీ రికార్డును అధిగమించిన డివిల్లీర్స్ ఇప్పుడు అభినందనల వెల్లువలో తడిసిముద్దవుతున్నాడు. ఆటగాళ్లు, మాజీలు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నమ్మశక్యం కాని బ్యాటింగ్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు. తాజా ప్రదర్శనతో ఏబీ డివిల్లీర్స్ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మెన్ జాబితాలో చోటు దక్కించుకుంటాడని ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం బాబ్ విల్లిస్ పేర్కొన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్... బాగా ఆడావంటూ షాహిద్ అఫ్రిది, తానెందుకు అత్యుత్తమ బ్యాట్స్ మనో చాటిచెప్పాడని సఫారీ మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News