: సుప్రసిద్ధ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ పరిస్థితి విషమం
ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ (94) ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనను శనివారం నాడు పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేర్చారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్ సమీర్ జోగ్ చెప్పారు. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికలో ఐదు దశాబ్దాలకు పైగా 'కామన్ మేన్' (సామాన్యుడు) కార్టూన్ పాత్ర సాయంతో సమాజంలోని లోటుపాట్లను ఎత్తిచూపడం ద్వారా ఆయన విశేషంగా పేరుగడించారు.