: కొత్తబంతిని సరిగ్గా వినియోగించుకోలేకపోయాం: ధోనీ
మెల్బోర్న్ వన్డే ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడాడు. కొత్త బంతితో వైఫల్యమే మ్యాచ్ ఓటమికి దారితీసిందని అభిప్రాయపడ్డాడు. మొత్తమ్మీద ఇదో పసందైన మ్యాచ్ అని పేర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ బాగా బౌలింగ్ చేశాడని, రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ధోనీ కితాబిచ్చాడు. భారత బౌలర్లు కొత్త బంతిని సద్వినియోగం చేసుకోలేకపోవడమే కీలకపాత్ర పోషించిందన్నాడు. ముక్కోణపు టోర్నీలో ఆడుతున్న జట్లన్నీ ఉత్తమమైనవేనని, ఈ నేపథ్యంలో బౌలర్లకు వెసులుబాటు కల్పించేలా టాపార్డర్ బ్యాట్స్ మెన్ బాధ్యతగా ఆడి భారీ స్కోర్లు సాధించాల్సి ఉంటుందని అన్నాడు.