: పోలీసులకు కొత్త కార్లు తప్ప కేసీఆర్ చేసిందేమీలేదు: నారా లోకేశ్
తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖరరావుపై టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం సమన్వయకర్త నారా లోకేశ్ విమర్శలు చేశారు. పోలీసులకు కొత్త కార్లు, తనకు కొత్త కాన్వాయ్ తప్ప తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం తమదేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థే మేయర్ పీఠం అధిష్ఠిస్తారని లోకేశ్ ధీమాగా చెప్పారు.