: రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్... బ్రేకిచ్చిన ఉమేశ్


మెల్బోర్న్ లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ వన్డే మ్యాచ్ లో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయింది. టీమిండియా విసిరిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు తొలి వికెట్ ను 51 పరుగుల వద్ద చేజార్చుకుంది. 24 పరుగులు చేసిన ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేసి భారత్ కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వాట్సన్ (41) నిలకడ ప్రదర్శించడంతో ఆసీస్ స్కోరు సెంచరీ మార్కు దాటింది. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా పరిస్థితికి తగ్గట్టుగా ఆడడంతో ఆసీస్ ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. ఈ తరుణంలో యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతమైన బంతితో వాట్సన్ ను బౌల్డ్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. ప్రస్తుతం ఆసీస్ 25 ఓవర్లలో 2 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఫించ్ 53, స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. కంగారూలు విజయం సాధించాలంటే 25 ఓవర్లలో 144 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లున్నాయి. ప్రస్తుతం సగం ఓవర్లు పూర్తికావడంతో మ్యాచ్ ఫలితం ఎటువైపున్న అంశం ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News