: సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం


ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్‌ సమీపంలో వున్న సింగరేణి న్యూటెక్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో గోడ ఒక్కసారిగా కుప్పకూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు గాయాలు అయినట్టు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రులను స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గనిలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అన్న విషయం తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News