: చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను నుంచి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైంది. తొలుత వేలివెన్నులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బాబు పాదయాత్ర చేపట్టారు. కొవ్వూరు నియోజకవర్గం బ్రాహ్మణగూడెం వరకు 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. ఆయన వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నడుస్తున్నారు.