: ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి: చంద్రబాబు
భవిష్యత్ తరాలకు దివంగత ఎన్టీఆర్ ఆదర్శమని, ఆయనకు భారతరత్న వచ్చేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆయన నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తెదేపా నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.