: 'ఫోర్' కొట్టకుండా రోహిత్ ఖాతాలో నాలుగు పరుగులు!


ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భాగంగా మెల్బోర్న్ లో జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియాల మ్యాచ్ లో ఓ అరుదైన ఘటన జరిగింది. మ్యాచ్లో భారత్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఒకే బంతికి నాలుగు పరుగులు తీశారు. అందరూ తీస్తారు కదా? ఫోర్ కొట్టి ఉంటాడు అనుకుంటున్నారా? కాదు... మరి ఇంకెలా అంటారా? కమ్మిన్స్ వేసిన నాలుగో ఓవర్ ఆరో బంతికి రోహిత్ బంతిని బలంగా బాది రహానేతో కలసి పరుగు మొదలు పెట్టాడు. ఆ బంతి కీపర్ దగ్గరకు చేరేసరికి వీరు నాలుగు పరుగులు తీశారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు అరుదు. ప్రస్తుతం భారత జట్టు 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News