: తాతగారి ఆశయాలు నెరవేరుస్తా: జూ.ఎన్టీఆర్


ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం కోసం తామంతా కృషి చేస్తామని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్ 19వ వర్థంతి సందర్బంగా నేటి ఉదయం ఎన్టీఆర్ గార్డెన్స్ లోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలసి జూ.ఎన్టీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని, తెలుగువారంతా ఐక్యంగా ఉండాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పాటుపడతామని నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News