: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ పోటీలు... తెలుగు వారియర్స్ ఘన విజయం


రాంచీలోని జేసీఎస్ఏ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా భోజ్‌పురి దబాంగ్స్ జట్టుతో జరిగిన టీ-20 మ్యాచ్‌ లో తెలుగు వారియర్స్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన దబాంగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. తెలుగుతారల దూకుడును నిలువరించడంలో ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా 15 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 160 పరుగులు సాధించి వారియర్స్ ఘన విజయం సాధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సచిన్ జోషి 77, ప్రిన్స్ 61 పరుగులతో అజేయంగా నిలిచారు.

  • Loading...

More Telugu News