: ఇంట్లోకి దూసుకెళ్లిన అత్తిలి-హైదరాబాద్ 'కావేరి' బస్సు
నల్గొండ జిల్లా మునగాల మండలం, ముకుందాపుం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుంచి హైదరాబాదుకు వస్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాకలోని ఒకరికి, బస్సు డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పెద్ద కుదుపునకు గురవడంతో ప్రయాణికులకు కొందరికి పాక్షికంగా గాయాలయ్యాయి. సందీప్ (28), కుమార్ (ఏలూరు), మదాత్ సైదులు పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద సంఘటన తీరును పరిశీలించారు. అతివేగమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తేల్చారు.