: కేజ్రీవాల్ కు నోటీసు జారీ చేసిన ఈసీ
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల కమిషన్ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరింది. తనను అవినీతితో ముడిపెడుతూ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఈసీకి సతీష్ పిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఎన్నికల్లో గెలుపొందడానికి బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయనుందని కేజ్రీవాల్ చేసిన ప్రసంగంపై కూడా ఈసీ సంజాయిషీ కోరింది. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని నోటీసు జారీ చేసింది.